Thursday, March 27, 2025
HomeNewsTelanganaABVP DHARNA: విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ ధర్నా

ABVP DHARNA: విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ ధర్నా

సంవత్సరాల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సమస్యలపైన నిత్యం విద్యార్థి పరిషత్ నుండి అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ పట్టించుకోవడంలేదని ఏబీవీపీ నాయకులు తెలిపారు. విద్యారంగ సమస్యలపై శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.

ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు లేక సరిపడ అధ్యాపకులు లేక నానా అవస్థలు పడుతుంటే మరొకవైపు ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలు లక్షలకు లక్షలు ఫీజులు దండుకుంటున్నారని విమర్శించారు. ఇవేవీ పట్టించుకోనటువంటి ప్రభుత్వం కేవలం చర్యలు తీసుకుంటామంటూ హామీలు ఇస్తూ చేతులు దులుపుకుంటుందని ఫైర్ అయ్యారు. అక్రమాలకు పాల్పడిన ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలపైన చర్యలు తీసుకుంటామంటూ, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు తప్ప అమలు చేయడం లేదని అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడిని అరికట్టడంలో మరియు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు వినతి పత్రం అందజేశారు.

డిమాండ్స్

    1. ప్రైవేటు, కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలల్లో అక్రమంగా లక్షలకు, లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి.
    2. ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలి.
    3. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ ,కార్పొరేట్ పాఠశాలల్లో బుక్స్, యూనిఫామ్స్ అమ్ముతున్న యాజమాన్యాలపైన కఠిన చర్యలు తీసుకోవాలి.
    4. ప్రభుత్వ గుర్తింపు మరియు నిబంధనలను పాటించని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి.
    5. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి. వెంటనే DEO, MEO అధికారులను నియమించాలి.
    6. ప్రభుత్వ పాఠశాలల్లో అందజేస్తున్న మధ్యాహ్నభోజనం లో జరుగుతున్న అవకతవకలపైన విచారణ జరిపి, నాణ్యతలేని ఆహారాన్ని అందిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోవాలి మరియు విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి.
    7. మెగా డీఎస్సీ ద్వారా 24 వేలకు పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేయాలి.
    8. ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్ మరియు స్క్యావెంజర్లను నియమించాలి.
    9. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి.
    Share the post
    WhatsApp Group Join Now
    Telegram Group Join Now
    Instagram Follow us
    https://news2telugu.com
    శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments