...

జోడో యాత్రకు కశ్మీర్ లో అపూర్వ స్పందన.. ప్రముఖుల మౌనం సరికాదన్నఓమర్ అబ్దుల్లా

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో యాత్రకు కశ్మీర్‌లో అపూర్వ స్పందన లభిస్తోందని ఎన్సీపీ (నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ) నేత ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. కానీ మీడియా, కశ్మీర్‌ లోని ప్రముఖులు ఈ యాత్రపై మౌనంగా ఉండటంపై ఆయన ఒకింత విస్మయానికి లోనవుతున్నానన్నారు. ఈ యాత్రపై మాట్లాడాల్సిన వారు మాట్లాడటం లేదన్నారు. న్యూస్ ఛానెళ్లు కూడా సరిగా కవరేజీని ఇవ్వడం లేదని తిలిపారు. కశ్మీర్లోని స్త్రీలు, పురుషులు, పెద్ద, చిన్నఅనే తారతమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని.. భారత దేశ ఐక్యత కొరకు ప్రజలు రోడ్లపై బారులు తీరుతున్నారని ఓమర్ అబ్దుల్లా ట్విట్టర్ లో పోస్టు చేశారు.

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 30న ముగియనుంది. ఈ సందర్భంగా సోమవారం శ్రీనగర్‌లో భారీ ర్యాలీ ఏర్పాటు చేయనున్నారు. కాంగ్రెస్ నాయకులతో పాటు ఇతర ప్రముఖ నేతలు ఈ సభకు హాజరవుతున్నారు. కాంగ్రెస్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర కశ్మీర్‌లో ప్రవేశించడంతో ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛా వాయువులను పీల్చినట్లు ఉందని పాడీపీ పార్టీ (పీపుల్ డెమొక్రటిక్ పార్టీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తెలిపారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని (ఆర్టికల్‌ 370)రద్దు చేసిన తర్వాత ప్రజలు భారీగా ఇండ్లలో నుంచి బయటకి రావడం ఇదే తొలిసారి అని ఆమె పేర్కొన్నారు. భారత్‌ జోడో యాత్ర కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా సరిహద్దుకు చేరుకున్న సందర్బంగా రాహుల్‌ గాంధీకి స్వాగతం తెలిపి యాత్రలో పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

కశ్మీర్ లో భద్రతా కారణాలతో జోడో యాత్రను తాత్కాలికంగా శుక్రవారం రోజున నిలిపి వేశారు. తిరిగి యాత్ర ఈరోజు ప్రారంభం అయింది. జనాన్ని అదుపు చేయడంలో పోలీసులు సరిగా వ్యవహరించలేదని రాహుల్ ఆరోపించారు. తనకు పోలీసులు సరైన విదంగా రక్షణ కల్సించడం లేదన్నారు. తన భద్రతా సిబ్బంది సూచనల ప్రకారం తాను యాత్ర నిలిపి వేసినట్లు రాహుల్ తెలిపారు. జమ్మూలోని బనిహాల్‌ నుండి జవహ ర్‌లాల్‌ సొరంగం ద్వారా కాజీగుండ్‌ లోనికి ప్రవేశించిన రాహుల్‌ గాంధీ కొద్దిసేపటి తరువాతనే యాత్రను నిలుపుదల చేసుకున్నానని ఆయన అన్నారు.

అమిత్ షాకు మల్లికార్జున ఖర్గే లేఖ

భారత్ జోడో యాత్ర శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య ఆగిపోయింది. ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ ఒబ్దుల్లా రాహుల్‌తో పాటు యాత్రలోనే ఉన్నారు. భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. వెంటనే జోక్యం చేసుకుని భారత్ జోడో యాత్రకు పటిష్ఠ బందోబస్తు కల్పించాలని కోరారు. శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్ర ముగిసేంత వరకు రాహుల్ గాంధీకి భద్రత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధించి వెంటనే అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈనెల 30న శ్రీనగర్‌లో జరిగబోయే కార్యక్రమానికి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు హాజరవుతారని అన్నారు. దీనికోసం భద్రత కల్పించాలని అమిత్ షాను విజ్ఞప్తి చేశారు.

భద్రతా లోపాలు అవాస్తవం: పోలీసులు

కశ్మీర్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రతపై వస్తున్న ఆరోపణలను అక్కడి పోలీసులు ఖండించారు. తాము పటిష్టమైన సెక్యూరిటీని అందిస్తున్నామని అన్నారు. యాత్రలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నట్లు వివరాలను తమకు చెప్పలేదని, అలా ఒక్క సారిగా చాలా మంది రావడం వలనే భద్రతలో సమస్యలు వస్తున్నాయని అన్నారు. కశ్మీర్ పోలీసులపై కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ (బారతీయ జనతా పార్టీ) నేతలు మండిపడుతున్నారు.

కశ్మీర్‌పై కాంగ్రెస్ నజర్

భారత్ జోడో యాత్ర గత సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 3,970 కిలోమీటర్ల తర్వాత జనవరి 30న శ్రీనగర్‌లో ముగియనుంది. దేశంలోని బావ సారూప్యత కలిగిన పార్టీలన్నింటికీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖలురాశారు. ఈ సారి అన్నిపార్టీలతో కలిసి కట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కన్నుఈ సారి కశ్మీర్ పై పడింది.

కశ్మీర్ లో పట్టు ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాను కాంగ్రెస్ పార్టీ తమ వైపు తిప్పుకుంది. దశాబ్దాల కాలం నుండి అబ్దుల్లాలకు కాంగ్రెస్ తో విడదీయరాని అనుబంధం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా రెండు పార్టీల మద్య దూరం పెరిగింది. అయితే స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగి, వారిని బుజ్జగించారు. తద్వారా రాహుల్ యాత్రలో ఏకంగా ఓమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. కశ్మీర్ లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పని చేస్తోంది. కాంగ్రెస్ పార్టీని నిలువరించేందుకే గులాం నబీ ఆజాద్ చేత బీజేపీనే కొత్త పార్టీ పెట్టించిందని పలువురు విశ్లేషిస్తున్నారు.

Share the post

Hot this week

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. శనివారం...

Khairatabad Ganesh: సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో 70 అడుగుల ఖైరతాబాద్ గణనాథుడు

గణేష్ నవరాత్రులు అనగానే మనకు మొదటగా గుర్తుకువచ్చే పేరు ఖైరతాబాద్ మహా...

Dr K Laxman: 2047 నాటికి శక్తివంతమైన దేశంగా భారత్: ఎంపీ లక్ష్మణ్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యలయంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు...

ఆగ్రాకు మంత్రి సీత‌క్క‌.. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్య‌ర్యంలో జరిగే చింత‌న్ శివిర్ కు హాజరు

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆగ్రాలో రెండు...

BJP: పార్టీలో తన స్థాయిని తగ్గిస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలక..!

బీజేపీ అధిష్టానంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలిగినట్లు తెలుస్తోంది....

Topics

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. శనివారం...

Khairatabad Ganesh: సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో 70 అడుగుల ఖైరతాబాద్ గణనాథుడు

గణేష్ నవరాత్రులు అనగానే మనకు మొదటగా గుర్తుకువచ్చే పేరు ఖైరతాబాద్ మహా...

Dr K Laxman: 2047 నాటికి శక్తివంతమైన దేశంగా భారత్: ఎంపీ లక్ష్మణ్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యలయంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు...

ఆగ్రాకు మంత్రి సీత‌క్క‌.. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్య‌ర్యంలో జరిగే చింత‌న్ శివిర్ కు హాజరు

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆగ్రాలో రెండు...

BJP: పార్టీలో తన స్థాయిని తగ్గిస్తున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలక..!

బీజేపీ అధిష్టానంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలిగినట్లు తెలుస్తోంది....

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: జర్నలిస్ట్ శిగుల్ల రాజు

వినాయక చవితి సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ శిగుల్ల రాజు రాష్ట్రప్రజలకు శుభాకాంక్షలు...

రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి పర్వదినం సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు...

కేసీఆర్ దశమ గ్రహం.. తెలంగాణ ప్రజలకు ఆయన పీడ విరగడైంది : కేంద్రమంత్రి బండిసంజయ్

తెలంగాణలో వరదలవల్ల నష్టం సంభవించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు...
spot_img

Related Articles

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.