వికసిత్ భారత్ లక్ష్యంగా వికసిత్ పత్రాన్ని నరేంద్ర మోదీ గ్యారంటీగా ప్రజల ముందుంచాం. అందుకు భిన్నంగా కాంగ్రెస్ విభజిత్ రాజకీయాలతో, విభజన భారత్ విధానాలతో వ్యవహరిస్తోందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. విపక్ష కూటమికి ఓటమి తప్పదని తెలిసిపోయాక విభజించు భారత్ విధానాన్ని తెర మీదకు తెచ్చారని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించి కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచింది.. అంబేద్కర్ ను గౌరవించి భారత రత్న ఇచ్చిన ఘనత బీజేపీదేనని తెలిపారు. విభజించు పాలించు విధానం కాంగ్రెస్ డీఎన్ఏ లోనే ఉందని ఆయన దుయ్యబట్టారు. ముస్లిం సంతుష్టీకరణ విధానాలతో కాంగ్రెస్ హిందూ సమాజంపై విషం జిమ్ముతోందని లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ సనాతన ధర్మం వినాశనం కోరుకునే పార్టీ అని ఆరోపించారు. CAA పట్ల కాంగ్రెస్ కూటమి విష ప్రచారం చేస్తోందన్నారు. పౌరసత్వం ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిప్పులు పోసుకుంటుందని మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రశాంతంగా ఉంది.. అయితే, అధికారంలోకి వస్తె 370 నీ మళ్ళీ తెస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మతపరమైన రిజర్వేషన్లతో చిచ్చు పెడుతోందని నిప్పులు చెరిగారు. బీసీ (ఈ) లోకి ముస్లిoలను తెచ్చి అదనంగా నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిoచడం బీసీలకు అన్యాయం చేసినట్టు కాదా..? అని ప్రశ్నించారు.