భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్నపీవీ నరసింహారావు జయంతి సందర్భంగా తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో పీవీ చిత్రపటానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , ఎమ్మెల్సీ మధుసూధనా చారి , లేజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా చార్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ గడ్డమీద పుట్టి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహానుభావుడు పీవీ నరసింహారావు” అని తెలిపారు. అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడే బహుభాషా కోవిదుడు అని కొనియాడారు . ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
మాజీప్రధాని పీవీకి నివాళులు అర్పించిన అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మెన్ లు
RELATED ARTICLES