శాసనమండలికి జరుగుతున్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాల్వంచలో శుక్రవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, తాటి వెంకటేశ్వర్లు,మె చ్చా నాగేశ్వరరావు, కొత్తగూడెం మునిసిపల్ ఛైర్ పర్సన్ సీతామహాలక్ష్మీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.