Wednesday, March 26, 2025
HomeCinemaTollywoodనందమూరి తారకరత్నమృతి.. పలువురి సంతాపం

నందమూరి తారకరత్నమృతి.. పలువురి సంతాపం

ప్రముఖ తెలుగు సినీ నటుడు నందమూరి తారకరత్న(40) ( Nandamuri Taraka ratna )శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు (Passed away). ఆయన మరణ వార్తను ఆసుపత్రి వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. జనవరి 27న తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్‌ చేపట్టిన పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కుప్పం వెళ్లారు. పాదయాత్రలో నడుస్తున్న సమయంలోనే.. గుండెపోటు రావడంతో పార్టీ కార్యకర్తలు హుటాహుటిన కుప్పంలో ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం వెంటనే ఆయనను బెంగుళూరు లోని నారాయణ హృదయాలయకు తీసుకువెళ్లారు.

అయితే తారకరత్నఅప్పటికే కోమాలోనికి వెళ్లిపోయాడు. ఆయనకు చికిత్స అందించడానికి విదేశాలనుండి డాక్టర్లు వచ్చి వైద్యం చేసినా ఫలితం లేకుండా పోయింది. డాక్టర్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తారకరత్నకు భార్య అలేఖ్య రెడ్డి, కుమార్తె నిషిక ఉన్నారు. నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమించడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 23 రోజుల పాటు చావుతో పోరాడిన తారకరత్న మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయన కోలుకోవాలని నందమూరి అభిమానులతో పాటు రెండు రాష్ట్రాల అభిమానులు చేసిన పార్థనలు ఫలించలేదు. తారకరత్న మరణంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. తారకరత్న భౌతికకాయాన్ని బెంగుళూరు నుండి హైదరాబాద్ లోని మోకిలలోని ఆయన నివాసానకి తరలించనున్నారు. తారకరత్న పార్థీవదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం రేపు ఉదయం నుండి సాయంత్రం వరకూ తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉంచనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో తారకరత్నఅంత్యక్రియలు నిర్వహిస్తారు.

తారకరత్న మరణం పట్ల పలువురు దిగ్ర్భాంతి

తారకరత్న మరణం తీవ్ర బాధను కలిగించిందని టీడీపీ అధ్యక్షుడు, నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఆయన బ్రతకాలని చేసిన ప్రయత్నాలు, కుటుంబసభ్యుల, అభిమానుల ప్రార్థనలు ఫలించలేదని విచారం వ్యక్తం చేశారు. తారకరత్న సతీమణితో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఆమెను ధైర్యంగా ఉండాలని అన్నారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. తారకరత్న తిరిగి కోలుకుంటాడని భావించానని.. అతని మరణం బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సంతాపాన్ని తెలిపారు. బావా అని పిలిచే ఆగొంతు తనకు ఇక వినిపించదని.. నేనున్నానని తన వెంట నడిచే అడుగుల చప్పుడు ఆగిపోయిందని నారా లోకేష్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తారకరత్న మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments