Menu

  • Home
  • తెలంగాణ
  • తెలంగాణ సర్కార్ పై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
Image

తెలంగాణ సర్కార్ పై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

గణతంత్ర దినోత్సవ వేడుకలు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆద్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలకు సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్‌లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గవర్నర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తరువాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర్ర అభివృద్ధికి రాజ్ భవన్ ఎల్లవేళలా సహకరిస్తుందని గర్తు చేశారు. హైదరాబాద్మ హానగరం అభివృద్ధిలో ఎన్నోరంగాలలో దూసుకుపోతుందని తెలిపారు. ఐటీ, వైద్యరంగాలలో హైదరాబాద్ ప్రత్యేక గర్తింపు తెచ్చుకుందని వివరించారు. దేశంలోని ఇతర నగరాలకు భాగ్యనగరం అనుసంధానం అయి ఉందని అన్నారు. తెలుగు రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే సంక్రాంతి కానుకగా వందేభారత్ రైలును కేటాయించారని తెలిపారు.

రాజ్భవన్

ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన దేశం మనది. మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగాన్ని రూపొందించారని గవర్నర్కొ నియాడారు.రాజ్యాంగ రచనలో డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేడ్కర్‌ ఎంతో అంకితభావం కనబరిచారని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో రాజ్‌భవన్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని.. పోషకాహార సమస్య నివారణకు కృషి చేస్తున్నామని గవర్నర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి గవర్నర్ మాట్లాడుతూనే కేసీఆర్ ప్రభుత్వంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమందికి తాను నచ్చకపోవచ్చుననీ.. అయినప్పటికనీ తెలంగాణ అభివృద్ధి కొరకు కృషి చేస్తానంటూ గవర్నర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిలో తన పాత్ర తప్పక ఉంటుందని తమిళిసై అన్నారు. కొత్త కొత్త భవనాలు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదని, మన పిల్లలు విదేశాల్లో చదవడం కూడా అభివృద్ధి కాదననీ.. రాష్ట్ర్రంలోని విద్యాలయాలలో అంతర్జాతీయ స్థాయి వసతులు ఉండాలని అన్నారు.

Governor

ప్రజాప్రతినిధులు రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని ఆమె సూచించారు. తెలంగాణ ప్రజలు ఆత్మస్థైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. తెలంగాణతో తనకున్నది మూడేళ్ల అనుబంధం కాదనీ.. పుట్టుకనుంచే ఉందని అన్నారు. కొంతమందికి తాను నచ్చకపోవచ్చును కానీ.. తెలంగాణ ప్రజలంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె అన్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గవర్నర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమర వీరుల సైనిక స్మారక స్థూపానికి గవర్నర్ తమిళిసై నివాళులర్పించారు. అనంతరం గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోల్డెన్‌ గ్లోబ్స్ అవార్డు గెలుచుకున్న, ఆస్కార్‌ అవార్డుకు నామినేట్అ యిన ‘నాటు నాటు’ పాట సంగీత దర్శకుడు & గీత రచయిత ఎంఎం కీరవాణి, చంద్రబోస్‌లను గవర్నర్ తమిళిసై సత్కరించారు.

పుదుచ్చేరి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మధ్య గణతంత్ర వేడుకలు జరగకుండా చేయాలని యత్నించారన్నారు. రెండు సంవత్సరాల నుండి రాజ్‌భవన్ పై ప్రభుత్వం వివక్ష చూపుతోందని తెలిపారు. ప్రభుత్వం రాజ్యాంగ విలువలు పాటించడంలేదని గవర్నర్ ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరపాలని తాను రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాశానని అన్నారు. అయితే దాన్ని పక్కనపెట్టి రాజ్‌భవన్‌లోనే జరుపుకోవాలని రెండు రోజుల క్రితం సమాచారమిచ్చారని తెలిపారు. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చానని గవర్నర్ తెలిపారు. ఇటీవల ఖమ్మంలో సుమారు ఐదు లక్షల మందితో కేసీఆర్ బహిరంగ సభ పెట్టారని, బహిరంగ సభకు లేని కరోనా రిపబ్లిక్ డేకు గుర్తు వచ్చిందా? అని రాష్ట్ర్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Share the post