...

గవర్నర్ ప్రసంగంపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ మద్య తలెత్తిన ప్రతిష్టంభన విషయంలో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ 2022-23 బడ్జెట్ కు ఆమోదం తెలిపేలా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ఉపసంహరించుకుంది. అంతే కాకుండా గవర్నర్ ప్రసంగంతో పాటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే హైకోర్టుకు తెలియజేశారు. గవర్నర్ ను విమర్శించకూడదు అనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. హైకోర్టు సూచనతో గవర్నర్ తరపున న్యాయవాది అశోక్ ఆనంద్, ప్రభుత్వ తరపున న్యాయవాదులు ఇరువురు చర్చించుకున్నతర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు దూరం పెరిగింది. శాసన సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టాలటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. అయితే ప్రభుత్వం జనవరి 21వ తేదీనే గవర్నర్ అనుమతి కోరుతూ లేఖ రాసింది. గవర్నర్ నుండి అనుమతి రానందునే ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఫిబ్రవరి 3వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అయితే గవర్నర్ మాత్రం ప్రభుత్వం పంపిన లేఖకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అంతే కాకుండా బడ్జెట్ సభలో ప్రవేశ పెట్టేముందు గవర్నర్ ప్రసంగం ఉంటుందినీ.. దానికి సంబందించిన కాపీ ఇంకా తనకు అందలేదని.. తనకు ఆ కాపీని పంపించారా ? లేదా? అని గవర్నర్ కార్యాలయం నుండి ప్రభుత్వం నుండి సమాదానానికై లేఖ రాశారు.

అయితే ఈలేఖపై ప్రభుత్వం స్పందించలేదు. గవర్నర్ కూడా బడ్జట్ ఆమోదం విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఎదురు చూసే ధోరణితో ఉన్నారు. కానీ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల తేదీ ఫిబ్రవరి 3వ తేదీ దగ్గర పడుతుండడంతో అందరిలో ఉత్కంట నెలకొంది. కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని నిర్ణయించింది. సోమవారం ఉదయమే ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికోసం సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను ప్రభుత్వం రంగంలోనికి దింపింది. రాజ్యాంగంలోని 202 ఆర్టికల్ ప్రకారం శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టాలంటే ఖచ్చితంగా గవర్నర్ ముందుగా ఆమోదం తెలపాలి. ఇది చాలా అత్యవసరమైన విషయమని.. గవర్నర్ ప్రసంగం అనేది అత్యవసరమైన విషయం కాదని.. ఇవి రెండు పరస్పరం విరుద్దమైనవని ఒకదానితో మరొకటి పోల్చవద్దని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. గవర్నర్ ఖచ్చితంగా అనుమతి తెలపాలని అంటున్నారు. లేకుంటే రాజ్యాంగ పరమైన ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గవర్నర్ తమిళిసై వ్యవహారశైలి వల్ల రాజ్యాంగ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ts high court governor 1

కానీ గతేడాది కూడా తెలంగాణ ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఆమోదం తెలిపానని గవర్నర్ గతంలో వివరించారు. కానీ ఈసారీ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి తెలుపకపోవడంతో ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసంది. గవర్నర్ పదవి అనేది రాజ్యాంగబద్దమైనది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిచేత ప్రమాణ స్వీకారం చేయించేది కూడా గవర్నరే. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గవర్నర్ పై చర్యలు తీసుకుంటుందని ముందుగా భావించారు. కానీ అనూహ్యంగా రాష్ట్ర్ర ప్రభుత్వం పిటిషన్ ను ఉపసంహరించుకుంది. బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ఇదివరకే నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు, మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలతో ప్రగతి భవన్ లో సమావేశమై బడ్జెట్ సమావేశాల తేదీలపై సమాలోచనలు చేస్తున్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

అసత్య ప్రచారాలపై డీసీపీకి బీఆర్ఎస్ మహిళా విభాగం ఫిర్యాదు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన,...

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

Topics

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

అసత్య ప్రచారాలపై డీసీపీకి బీఆర్ఎస్ మహిళా విభాగం ఫిర్యాదు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన,...

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...
spot_img

Related Articles