దేశ రాజధాని డిల్లీలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖపట్నమే అని ప్రకటన చేశారు. అంతే కాకుండా అతి త్వరలోనే తను కూడా అక్కడికి మారబోతున్నట్లు తెలిపారు. విశాఖపట్టణానికి పెట్టుబడి దారులు రావాలని పారాశ్రామిక వేత్తలను, వివిధ దేశాల దౌత్యవేత్తలను ఆహ్వానించారు. రాష్ట్ర రాజధాని, వికేంద్రీకరణ విషయంపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇతర వివాదాలతో ఎటువంటి సంబందం లేకుండా వచ్చే ఉగాది నాటికి రాజధానిని విశాఖకు తరలిస్తారనే వార్తల నేపథ్యంలో సీఎం జగన్ చేసిన ప్రకటన వాటికి బలం చేకూర్చినట్లు అయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన విశాఖకు మారుతుందని, విశాఖపట్నం నుండే తన పరిపాలనా కార్యక్రమాలు కొనసాగుతాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. అలాగే పెట్టుబడులు పెట్టిన వారికి సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు. వచ్చే మార్చిలో వైజగ్ లో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్మెం ట్ సదస్సుకు పారిశ్రామిక వేత్తలను సీఎం జగన్ ఆహ్వానించారు. ప్రపంచ వేదిక పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిఅన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు పెట్టుబడులు అవసరం అని ఆయన తెలిపారు. ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోగత మూడు సంవత్సరాలుగా వరుసగా నెంబర్ వన్ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి గర్తుచేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూల పరిస్థితులను ఈ సంధర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వివరించారు.
#WATCH | "Here I am to invite you to Visakhapatnam which will be our capital in the days to come. I will also be shifting to Visakhapatnam in the months to come": Andhra Pradesh CM YS Jagan Mohan Reddy at International Diplomatic Alliance meet in Delhi pic.twitter.com/wANqgXC1yP
— ANI (@ANI) January 31, 2023
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అత్యంత సుధీర్ఘ తీర ప్రాంతం, అలాగే రాష్ట్రం 11.43 శాతం వృద్ధి రేటుతో జీఎస్‌డీపీ అభివృద్ధి లో పురోగమించటం వంటి అంశాలు శుభపరిణామం అన్నారు. వేగంగా అభివృద్ధి చేందే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ ముదంజలో ఉందని అన్నారు. సింగిల్ డెస్క్ విధానం ద్వారా నూతన పరిశ్రమలకు కేవలం 21 రోజలలోనే అనుమతులు ఇస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్టు మంజూరు అయితే.. మన ఆంధ్రప్రదేశ్ కే మూడు కారిడార్లు వచ్చాయని తెలిపారు. ఇప్పటికే 6 పోర్టులు రాష్ట్రంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని అన్నారు. ఇండస్ట్రియల్, మాన్యుఫ్యాక్చరింగ్, టెక్స్ టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్, ఫార్మా, ఆటోమొబైల్, మెడికల్ క్లస్టర్స్ వంటివి రాష్ట్రంలో ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీ వెళ్లిన వారిలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డితో పాటు పలువురు అధికారులు ఉన్నారు.
ట్విట్టర్ ట్రెండింగ్ లో విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను రాష్ట్ర రాజధానిగా ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా #Visakhapatnam హ్యాష్‌ట్యాగ్ తొ ట్విట్టర్ నెట్టింట్లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సీఎం జగన్ దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్రకటన చేయడంతో జాతీయ మీడియా కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ప్రాధాన్యం ఇవ్వడంతో ట్విట్టర్లో విశాఖ పేరు మార్మోగిపోతోంది. అనుకూలంగా వైసీపీ సోషల్ మీడియా.. వ్యతిరేఖంగా తెలుగుదేశం సోషల్ మీడియా వారియర్లు పరస్పరం పోస్టులతో సోషల్ మీడియాలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.